Site icon HashtagU Telugu

Roja Fire : మామూలు యాంకర్లే కారు కొంటున్నారు…నేను కొంటే తప్పేంటీ..?

Mla Roja

Mla Roja

టీడీపీ నేతలపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మధ్యే తాను కొత్త కారు కొన్నారు. అయితే ఆ కారు రుషికొండ గిఫ్ట్ అంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజుల్లో మామూలు యాంకర్లు…చిన్న యాక్టర్లు కూడా కారు కొంటున్నారన్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పు అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా.

కారు కొనాలంటే లోన్ తీసుకుంటే చాలు. తాను కొనడం గొప్పేమీ కాదు. తన కొత్త కారు విషయంలో ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలకు ఏదీ దొరక్క ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని రోజా మండిపడ్డారు. ఏది అమ్మినా…ఏదీ కొన్నా ఎంతో పారదర్శకతతో ఉంటానని స్ఫష్టం చేశారు. చదువురానికి వారికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నానో బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థం అవుతుందన్నారు రోజా.

Exit mobile version