Site icon HashtagU Telugu

Roja Dance: థింసా డ్యాన్స్ తో దుమ్మురేపిన రోజా.. వీడియో వైరల్

Roja Dance, AP

Roja Dance

ఆంధ్రప్రదేశ్ (AP) పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్కే రోజా (RK Roja) మరోసారి డాన్స్ చేసి వావ్ అనిపించారు. ఆమె డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. విశాఖపట్నంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. కళాకారులను ప్రోత్సహించారు. థింసా కళాకారులతో కలిసి రోజా నృత్యాలు చేసి కళాకారులను ప్రోత్సహించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన ఆర్టిస్టులకు రోజా బహుతులు అందజేశారు.

రోజా (RK Roja) డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిమానులు, నెటిజన్స్ రోజా డ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. డిసెంబరు 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రోజా (RK Roja) గతంలో చేసిన డాన్స్ వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.

Also Read: Kavitha Jagruthi: కేసీఆర్ బాటలో కవిత.. భారత్ జాగృతిగా తెలంగాణ జాగృతి!