Site icon HashtagU Telugu

Roja Boxing: బాక్సింగ్ రింగ్ లో రోజా పంచులు.. వీడియో వైరల్!

Roja boxing viral

Roja

ఏపీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు వరుస కార్యక్రమాలు, మరోవైపు డాన్సులు (Dance), ఆటలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా రోజా బాక్సింగ్ (Boxing) రింగ్ లో దిగి పంచులు విసిరి ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో ‘సిఎం బాక్సింగ్‌ నేషనల్‌ ఛాంపియన్‌ పోటీలను’ ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి అయినా  ఆమె ప్రారంభించారు. విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. అనంతరం మంత్రి రోజా బాక్సింగ్‌ (Boxing) లో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

మినిస్టర్ రోజా (Roja) బాక్సింగ్ ఆడుతున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానుల మనసులను గెలుచుకున్నారు. జగనన్న స్వర్ణోత్సవాల్లో మంత్రి రోజా చురుగ్గా పాల్గొని కళాకారుల్లో ఉత్సాహం నింపుతున్న సంగతి తెలిసిందే. ఆమె డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ (Viral) అవుతున్నాయి.

ఈ ఛాంపియన్షిప్ లో 14 రాష్ట్రాల నుండి 400 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాయల వెంకట రెడ్డి(K V R) , రాష్ట్ర బ్రాహ్మణ చైర్మన్ సుధాకర్ గారు , MLC Varudu Kalyani గారు, GCC ఛైర్పర్సన్ శోభ స్వాతి రాని, ST కమిషన్ చైర్మన్ కుంభ రవి బాబు గారు, బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Also Read: New Year Restrictions: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు!