YSRCP vs JSP : ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసేది “నారాహి” యాత్ర – ఏపీ మంత్రి మేరుగ నాగార్జున‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసేది వారాహి యాత్ర కాదని.. అది నారాహి యాత్రని ఏపీ కార్మిక శాఖ మంత్రి మేరుగ నాగార్జున

Published By: HashtagU Telugu Desk
merugu nagarjuna

merugu nagarjuna

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసేది వారాహి యాత్ర కాదని.. అది నారాహి యాత్రని ఏపీ కార్మిక శాఖ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎంకి నిండు ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్ధించాన‌ని.. ఏపీకి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డే సీఎం కావాలని స్వామి వారిని వేడుకున్నాన‌ని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు కుయుక్తులు కుట్రలు ప్రజలకు తెలుస్తూనే ఉందని.. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాలేని నాయకుడిగా చంద్రబాబు మిగిలి పోయార‌న్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం 2.25 లక్షల కోట్ల రూపాయలు డిబిటి రూపేణ ఇచ్చిన నాయకుడు సీఎం జ‌గ‌న్ అని.. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మె పరిస్థితి లేద‌ని.. అధికారంలో ఉన్న సమయంలో ఒక మాట, లేనప్పుడు ‌మరో మాట చెప్పె వ్యక్తి చంద్రబాబే మాత్ర‌మేన‌న్నారు. కుల ప్రస్తావనతో రాజకీయాలు చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నా,జగన్ ముందు పటాపంచల్ అవ్వాల్సిందేన్నారు. మోసాలు చేసేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోదులని ఎద్దేవా చేశారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ప్రకారం చంద్రబాబు హయాంలో భారతదేశంలో నాల్గవ స్ధానంలో ఉందని.. చంద్రబాబు హయాంలో వెలివేతలు, అన్యాయాలు, అక్రమాలే జరిగాయన్నారు.

  Last Updated: 09 Jul 2023, 08:28 PM IST