సీఎం జగన్.. రైతుల పక్షపాతి

రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, రైతులు ఆనందంగా ఉండటం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.

  • Written By:
  • Publish Date - October 7, 2021 / 11:45 AM IST

రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, రైతులు ఆనందంగా ఉండటం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. క్రాప్‌ హాలీడే ప్రకటించారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రైతులకు ఏ కష్టం రానివ్వకుండా చూస్తున్నారని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు.  హైదరాబాద్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు విశ్రాంతి తీసుకుంటూ..టీడీపీ శ్రేణులతో సీజన్‌కో అవతారం ఎత్తించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలపై టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి ఖండించారు. బుధవారం కాకినాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాను రైతు పక్షపాతిని అని ప్రకటించుకుని పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తాను రైతు పక్షపాతిని అని, తమది రైతు ప్రభుత్వమని ప్రకటించుకున్నారు. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఇవాళ ప్రతిరైతు జీవిత కాలం గుర్తుపెట్టుకునేలా, తరతరాలు మరిచిపోలేనట్లుగా రైతాంగం కోసం శాశ్వత వ్యవస్థలను నిర్మాణం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఉండాలని నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోపక్క రైతుల మీద ఒత్తిడి లేకుండా వైయస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద  పెట్టుబడి సాయం అందించే కార్యక‍్రమం నుంచి ఉచితంగా పంటల బీమా పథకం వరకూ చెప్పింది చెప్పినట్లుగా, చెప్పిన సమయం కన్నా ముందే చేస్తున్నారు.

ఏదైనా విపత్తు వచ్చినా పంటలు నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందించాలని ముఖ్యమంత్రిగారు శ్రీకారం చుట్టారు. రైతులు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు చేసినదానికన్నా ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. రైతుల హృదయాల్లో ముఖ్యమంత్రిగారు స్థానం సంపాదించుకుంటుంటే.. దీన్ని సహించలేని టీడీపీ కడుపుమంట బ్యాచ్‌ రోడ్లమీదకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు. బహుశా కడుపుమంటకు కారణం ఏంటంటే టీడీపీకి రాష్ట్రంలో పట్టగతులు ఉండవని అర్థం అయింది. దాంతో సీజన్‌కు ఒక అవతారం ఎత్తే టీడీపీ నేతలు..  ఈ సీజన్‌లో రైతు ప్రేమికుల అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నాయకులకు సిగ్గూ,శరం అనేది భగవంతుడు పెట్టలేదు. బుద్ధి, జ్ఞానం లేనట్లు మాట్లాడుతున్నారు.

ఈ రాష్ట్రంలో ప్రతి రైతు కళ్లలో ఆనందం, సంతృప్తితో ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. టీడీపీ నాయకులు రాసిన లేఖలు చూస్తే అనంతపురం జిల్లాలో పదిలక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ మాట్లాడుతున్నారు? ఎక్కడ పంట నష్టపోయింది. డ్రైస్పెల్‌ ఉన్నప్పుడు వాతావరణం మార్పు ఉంటుంది. కోస్తా జిల్లాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించారని చెబుతున్నారు … ఎక్కడ క్రాఫ్‌ హాలిడేని ప్రకటించారో చూపించండి. మీ హయాంలో అమలాపురం ప్రాంతంలో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామంటే అప్పటి హోంమంత్రి చినరాజప్ప పోలీసులతో రైతులను బెదిరించిన మాట వాస్తవం కాదా? వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితే ఉత్పన్నం కాదు. పెట్టుబడి సాయం దగ్గర నుంచి పంట నష్టపోయిన సాయాన్ని సకాలంలో ఇస్తున్నాం. ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం మేము ఇవ్వం.  తాజాగా మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ.. టీడీపీ నాయకులు తెగ బాధపడిపోతున్నారు. మీటర్లు బిగించడం వల్ల ఏ రైతుకన్నా అదనపు భారం పడుతుందా? రూపాయి సబ్సిడీ తగ్గించామా? కేవలం ఒక బాధ్యత ఉండాలని, విద్యుత్‌ సంస్థలకు వేలకోట్లు బకాయిలు పడకుండా, నాణ్యమైన విద్యుత్‌ అందించాలంటే ఒక వ్యవస్థను సక్రమంగా నడపాలని ఈ విధానం తీసుకువస్తున్నాం. దీనికి కూడా రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటే 96శాతం మంది రైతులు అనుకూలమని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు. మరి వారికి లేని బాధ మీకెందుకు వచ్చింది.

నకిలీ రైతులకు ఎందుకంత బాధ. మీకు రైతులంటే కేవలం అమరావతి రైతులేనా? భూములంటే రియల్‌ ఎస్టేట్‌ భూములేనా? మీకు అంతకు మించి ఇంకేమీ కనపడవు.  రాష్ట్రంలో వ్యవసాయం ఎలా  ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఎక్కడ ఏ పంటకు చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ఇన్‌వాల్వ్‌ అవ్వాల్సిందే అని ముఖ్యమంత్రిగారు మమ్మల్ని ఆదేశించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటలకు కాకుండా, మరో ఏడు పంటలకు వేరుశెనగ సహా ఉల్లి, బత్తాయి, అరటి  పంటలకు ఎమ్మెస్పీ ప్రకటించిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానిది. ఏ పంటకు ఎంత ఎమ్మెస్పీనో రైతు భరోసా కేంద్రంలో డిస్‌ప్లే చేస్తున్నాం. ఎక్కడైనా పంట నష్టపోతే కొనుగోలు చేస్తున్నాం’’ అని మంత్రి అన్నారు.