ఏపీ హోంమంత్రి తానేటి వనిత తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి దగ్గరుండి సహాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే..బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఒక ద్విచక్రవాహన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో హోంమంత్రి తానేటి వనిత తన కాన్వాయిలో అటుగా వెళ్తూ ప్రమాదాన్ని గమనించారు.
వెంటనే కాన్వాయిని ఆపించిన మంత్రి…బాధితుల వద్దకు వెళ్లి సహాయం అందించారు. మంత్రి అనిత స్వయంగా అంబులెన్సుకు ఫోన్ చేశారు. ప్రమాద బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన దంపతులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెప్పపాటు కాలంలోజరిగిన ప్రమాదాన్ని గమనించిన మంత్రి వెంటనే స్పందించి..సహాయం అందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.