AP: హారీశ్ రావుకు బొత్స కౌంటర్…వచ్చి చూడాలంటూ…!!

ఏపీలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ ధీటుగా సమాధానం ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Botsa Satyanarayana Ap Electricity Charges Hike

Botsa Satyanarayana Ap Electricity Charges Hike

ఏపీలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ ధీటుగా సమాధానం ఇచ్చారు. హరీశ్ రావు ఒకసారి ఏపీకి రండి..ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలేంటో తెలుసుకోండి. తెలంగా, ఏపీ పీఆర్సీలను పక్కపక్కన పెట్టి చూడండి…తేడా మీకే తెలుస్తుందంటూ కౌంటరిచ్చారు బొత్స సత్యనారాయణ. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా హరీశ్ రావు మాట్లాడటం సరికాదన్నారు. ఏపీలో టీచర్లు హ్యాపీగా ఉన్నారన్నారు.

కాగా అంతకుముందు హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందంటూ వ్యాఖ్యానించారు. కానీ టీఆర్ ఎస్ సర్కార్ 5ఏళ్లలో 73శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందన్నారు. వేతనాలు ఆలస్యం అవుతున్న సంగతి నిజమే కానీ…ఏపీలో జగన్ లా కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరించి ఉంటే ఏడాదికి 6వేల కోట్లు అప్పులు తీసుకుని రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేవారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు.

  Last Updated: 30 Sep 2022, 05:59 AM IST