Site icon HashtagU Telugu

AP News: తెలంగాణ మాజీ మంత్రిపై ఏపీ మంత్రి బొత్స ఫైర్, కారణమిదే

Botsa Satyanarayana

Botsa Satyanarayana

AP News: ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు.

10 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు.హైదరాబాద్ విశ్వనగరం అని.. అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్థానమా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని… లేని మాటలకు, తామేం మాట్లాడబోమని అన్నారు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆరోపించారు. విపక్షాలు ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద ఆడిపోసుకుంటున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.