Site icon HashtagU Telugu

AP: ఆ ముగ్గురికి…ఆ మూడు లేవు-అంబటి..!!

Minister Ambati Rambabu

Minister Ambati Rambabu

టీడీపీపై తనదైన స్టైల్లో మండిపడ్డారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో NTRయూనివర్సిటీ పేరు మార్పుపై రగడ కొనసాగోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, బాలయ్య, లొకేష్ పై వ్యంగాస్త్రాలు విసిరారు. బాబుకు బుద్ది లేదని…బాలయ్యకు సిగ్గులేదని..లోకేష్ కు అసలు బుర్రే లేదని…పేర్కొన్నారు. కష్టంలో కనీసం తండ్రిపై ప్రేమ కూడా చూపని బాలయ్యా…నీకు సిగ్గులేదయ్యా…అంటూ బాలయ్య బాబును టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. జోరు తగ్గించు జోకర్ బాలయ్య అంటూ చురకలంటించారు అంబటి.

మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు బుద్ధిలేదు…అసలు లోకేష్ కు బర్ర ఉందా…డౌటే అంటూ విమర్శించారు. టీడీపీ అసలు గురువు రామోజీరావు అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు. NTR పేరు మార్పు అనివార్యమని…దానిపై ముఖ్యమంత్రి జగన్ ఏపీ అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారని చెప్పారు అంబటి రాంబాబు.