ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 (MEGA DSC 2025)కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా DSC పరీక్షలకు 92.90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ ఫైనల్ కీ రేపు (జులై 29న ) విడుదలయ్యే అవకాశముంది. అనంతరం ఆగస్టు 11 నుంచి 21 వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 5న నియామక పత్రాలు అందించే అవకాశముంది.
ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల సంఖ్య దాదాపు 5.77 లక్షలుగా నమోదైంది. చాలా మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయగా, వారిలో చాలా మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారు, ఇది పరీక్షా నిర్వహణలో ప్రభుత్వ గంభీరతను ప్రతిబింబిస్తుంది.
Aamir Khan : ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్‌లు…! అసలేం జరిగిందంటే?
డీఎస్సీ తుది ఫలితాల ప్రకటనలో టెట్ స్కోర్ ప్రధాన పాత్ర పోషించనుంది. టెట్‌లో పొందిన వెయిటేజీని డీఎస్సీ స్కోర్లతో కలిపి తుది మెరిట్ లిస్ట్‌ను తయారుచేస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లాల వారీగా విడుదల చేయనున్నారు. దీంతో అభ్యర్థులకు నేరుగా నియామకానికి వెళ్లే అవకాశాలు సులభమవుతాయి. ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
భర్తీ చేయనున్న 16,347 పోస్టుల్లో 14,088 పోస్టులు జిల్లా స్థాయిలో ఉన్నాయి. వీటిలో ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ప్రధానమైనవిగా ఉన్నాయి. రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్ పాఠశాలల్లో 15 పోస్టులు మరియు బధిరులు, అంధులకు ఉన్న ప్రత్యేక పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలతో రాష్ట్రంలో విద్య రంగానికి గణనీయమైన బలం చేకూరనుంది.