AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్

AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
YS Jagan

YS Jagan

AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా కొద్ది సేపట్లో విజయవాడ ఏసీబీ అధికారులు (అవినీతి నిరోధక) కోర్టులో రెండవ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. అయితే.. సిట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండవ ఛార్జ్‌షీట్ దాదాపు 200 పేజీల విస్తృతమైన పత్రంగా సిద్ధమైంది. ఇందులో కేసులో ముగ్గురు ప్రధాన నిందితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రపై స్పష్టమైన ఆధారాలను పొందుపరిచారు ఏసీబీ అధికారులు.

Cat Kumar : బీహార్‌లో విచిత్రమైన ఘటన..పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!

ఆధారాల భాగంగా, వీరి కాల్ డేటా రికార్డులు, గూగుల్ టేక్ అవుట్ డేటా (Google Takeout), అలాగే స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లలోని కీలక ఫైళ్లు, ఈమెయిళ్లు, డాక్యుమెంట్లు అన్నీ సవివరంగా విశ్లేషించి ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అధికారులు చెబుతున్న ప్రకారం, ఈ సమాచారం మద్యం కుంభకోణం వెనుకున్న నెట్‌వర్క్, డబ్బు లావాదేవీలు, మరియు పన్నాగాలపై స్పష్టతనిస్తుంది.

ఈ రెండో ఛార్జ్‌షీట్ కోర్టులో దాఖలైన తర్వాత, కేసు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే.. సిట్ ఇప్పటికే మొదటి ఛార్జ్‌షీట్‌తో కొన్ని కీలక అరెస్టులు చేసి, ఆస్తుల జప్తులు చేపట్టిన సంగతి తెలిసిందే. రెండో ఛార్జ్‌షీట్ ద్వారా ఈ స్కాం వెనుక ఉన్న కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రెండో ఛార్జ్ షీట్ తో ఒక్కసారికిగా ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన భర్త

  Last Updated: 11 Aug 2025, 03:46 PM IST