AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనానికి కారణమైన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు విజయవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు మేరకు వీరికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో అరెస్టయిన ధనుంజయ రెడ్డి (A-31), కృష్ణమోహన్ రెడ్డి (A-32), బాలాజీ గోవిందప్ప (A-33)లు మే నెలలో సిట్ అధికారుల బృందం చేత పట్టుబడి రిమాండుకు వెళ్లారు. అప్పటి నుంచి విజయవాడ సెంట్రల్ జైలులోనే కొనసాగుతూ వచ్చారు.
Lunar Eclipse: రేపే చంద్రగ్రహణం.. ఏ దేశాలపై ప్రభావం అంటే?
వారాల తరబడి సాగిన వాదనలు, లాయర్ల విన్నపాలు, సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం ఏసీబీ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నిర్ణయం వెలువడగానే కుటుంబ సభ్యులు, అనుచరులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. అయితే మరోవైపు, ఏసీబీ కోర్టు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించాలని సిట్ (SIT) యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే న్యాయవాదుల సలహాలు తీసుకుని, హైకోర్టులో అర్జీ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ హాట్ టాపిక్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.
Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్.. ఏం చేశారంటే?