Site icon HashtagU Telugu

SC Sub Classification : ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం

AP Legislative Council unanimously approves SC classification proposal

AP Legislative Council unanimously approves SC classification proposal

SC Sub Classification : ఏపీ అసెంబ్లీ బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పామని ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పాను. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంటుంది. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగీరిల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.

Read Also: Kadapa : కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసింది. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం నా అదృష్టం. ఏబీసీడీ కేటగీరి విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్‌, కేటగీరిలపై 2000 సంవత్సరంలో చట్టం చేశాం. ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్‌ నివేదిక ఇచ్చింది.

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏర్పాటు చేశాం. హోటళ్లు, మంచినీటి బావుల వద్ద వివక్ష పాటించకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. సాంఘిక సమానత్వంపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించాం. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్‌. పేదల కోసం శాశ్వత గృహనివాస పథకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఆయన. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరం. అంటరానితనం నిషేధానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ను నేనే వేశా. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశాం.

ఎస్సీ కోసం రూ.8,400 కోట్లతో ఆర్థిక చేయూత పథకాలు తీసుకువచ్చాం. గతంలోనూ మాల, మాదిగ సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా. నా రాజకీయ జీవితమంతా పేదలకు న్యాయం చేసేందుకే కృషి చేశాను. ఎస్సీ వర్గీకరణ అంశంలో మాకు సహకరించిన పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు. ఆర్థికంగా బాగున్న వారు సమాజానికి ఎంతోకొంత తోడ్పాటునందించాలి. పేదరికంలో ఉన్న 30లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తాం అని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతులు పెంచేందుకు గతంలో పీపీపీ విధానం తీసుకువచ్చాను. కొత్తగా ఈ నెలలో పీ4 విధానం తీసుకురానున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్‌.. సంజూ శాంస‌న్ ప్లేస్‌లో యువ ఆట‌గాడు!