Site icon HashtagU Telugu

AP Issue : ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం ర‌ద్దు? సూర్య‌నారాయ‌ణ ఆస్తుల‌పై ఆరా!

Ap Issue

Ap Issue

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాన్ని ర‌ద్దు (AP Issue) చేసే దిశ‌గా జగ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన సంఘం నేత‌ల (Employees) నుంచి వివ‌ర‌ణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాడ‌ల‌ని డెడ్ లైన్ పెట్టింది. ఆ సంఘాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని ఎన్జీవో సంఘం అధ్య‌క్షుడు బండి శ్రీనివాసరావు ఇటీవ‌ల చెప్పిన విష‌యం విదిత‌మే. ఆ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం వేస్తోన్న అడుగులు క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాన్ని ర‌ద్దు (AP Issue)

గత వారం వేత‌నాలు, ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం గ‌వర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌ను ఏపీ ప్ర‌భుత్వ (AP Issue)ఉద్యోగుల సంఘం నేత‌లు క‌లిశారు. వాళ్ల స‌మ‌స్య‌ల గురించి తెలియ‌చేస్తూ ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన జీతాలు ఇచ్చేలా చ‌ట్టం కావాల‌ని కోరారు. అంతేకాదు, ఆర్థిక‌ప‌ర‌మైన అనే అంశాలు పెండింగ్ లో ఉన్న విష‌యాన్ని వివ‌రించారు. మునుపెన్న‌డూ లేనివిధంగా గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ప్ర‌భుత్వ ఉద్యోగులు (Employees) ప్ర‌భుత్వంపైనే ఫిర్యాదు చేయ‌డం సీరియస్ గా మారింది. రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములుగా ఉంటూ ప్ర‌భుత్వం మీద‌నే ఫిర్యాదు చేయ‌డం ఏపీ చ‌రిత్ర‌లో తొలిసారి. సీఎంగా జ‌గ‌న్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల వాల‌కాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో, తెల‌పాల‌ని నోటీసుల్లో కోరింది.

Also Read : AP Employees : ఉద్యోగ సంఘం నేతకు జగన్ మార్క్ తీర్పు?బండి తడాఖా

ఒక‌ప్పుడు ఏపీ ఉద్యోగుల వ్య‌వ‌హారం ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా సాగింంది. ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడ‌తామ‌న్న స్థాయికి వాళ్ల వాల‌కం వెళ్లింది. కూలీలుగా చూస్తున్నారంటూ ఉద్యోగులు `ఇగో`తో కూడిన వ్యాఖ్య‌ల‌ను చేశారు. ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బెదిరిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయం న‌డిపారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద వాళ్ల అత్యాశ ముందుకు సాగ‌డంలేదు. పైగా ప్ర‌భుత్వంలో భాగస్వాములుగా ఉంటూ వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆగ్ర‌హించారు. ఫ‌లితంగా సంఘాన్ని ర‌ద్దు చేసే వ‌ర‌కు ఇష్యూ వెళుతుంద‌ని తెలుస్తోంది.

ఏపీ ఉద్యోగ సంఘాని కంటే బ‌లంగా ఏపీ ఎన్జీవో

సాధార‌ణంగా ఏపీ ఉద్యోగ సంఘాని కంటే బ‌లంగా ఏపీ ఎన్జీవో ఉంటుంది. ఆ రెండు క‌లిసి ప‌నిచేసిన రోజుల్లో పాల‌క‌ప‌క్షం ఇబ్బంది ప‌డేది. ఆ సంస్కృతి ద‌శాబ్దాలుగా వ‌స్తూ ఉంది. దానికి చెక్ పెట్టిన మొద‌టి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అని చెప్పుకోవాలి. గ‌త ఏడాది జీతాల‌ను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫిట్మెంట్ విష‌యంలో ఆయ‌న ఉదారంగా వ్య‌వ‌హ‌రించారు. ఆర్థిక క‌ష్టాల్లో ప్ర‌భుత్వం ఉండ‌డం, క‌రోనా కాలంలో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వర్గాలు జీవితాలు చితిపోయిన సంద‌ర్భంలోనూ రూ. 11వేల కోట్ల భారాన్ని ప్ర‌జ‌ల‌పై ఉద్యోగులు మోపారు. రెండేళ్లుగా ఉద్యోగులు(కొంద‌రు మిన‌హా) ఇంటిప‌ట్టున ఉంటూ ప్ర‌తినెలా జీతం తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఫిట్మెంట్ కు ప‌ట్టుబ‌ట్టారు. ఫ‌లితంగా జ‌నం మీద భారం మోపారు.

Also Read : AP Employees : జీతాలిస్తే చాలు,ఇంకేమొద్దు! ఉద్యోగుల‌కు త‌త్త్వం బోధ‌ప‌డి.!

ఇప్పుడు పీఆర్సీ వేయాలంటూ పాల‌క‌పక్షం మీద ఒత్తిడి తెస్తున్నారు. సాధ్యంకాదంటోన్న సీపీఎస్ కోసం ప‌ట్టుబ‌ట్టారు. మంత్రివ‌ర్గం ఉప సంఘం అన్ని ర‌కాలుగా అధ్య‌య‌నం చేసిన త‌రువాత ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలు తీర్చ‌లేనివ‌ని తేల్చారు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ద్ధ‌తుతో ఉద్యోగుల సంఘం నేత‌లు ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హించారు. ప్ర‌త్యామ్నాయంగా ఎన్జీవో సంఘం నేత‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీశారు. ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డానికి దూకుడుగా వెళుతోన్న ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘం మీద తిర‌గ‌బ‌డేలా చేశారు. దీంతో ఎన్డీవో సంఘం వైసీపీ అనుబంధంగా , ప్ర‌భుత్వం ఉద్యోగుల సంఘం టీడీపీ కి మ‌ద్ధ‌తు ఇచ్చేదిగా మారింది. అందొచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌డంలేదు. ఆ సంఘాన్ని ర‌ద్ధు చేసే దిశ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అదే జ‌రిగితే, ఏపీ చ‌రిత్ర‌లో మ‌రో రికార్డు ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఖాతాలో ప‌డనుంది.