ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ని ప్రవేశపెడుతోంది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఈ బడ్జెట్ ద్వారా ఆమోదం తెలుపబడుతుంది. ఈ బడ్జెట్ లో భారీ ఖర్చులు , కొత్త పథకాలు అనేవి ఉండవు..ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెడుతుంది. ఈరోజు బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Finance Minister Buggana Rajendranath) ప్రవేశపెడతారు.
We’re now on WhatsApp. Click to Join.
బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ‘గత ఐదేళ్ల బడ్జెట్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పించాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా సీఎం భావించారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారు’ అని స్పష్టం చేశారు. ఉదయం. 11గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఇదిలా ఉంటె.. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ గందరగోళ వాతావరణం నెలకొంది. పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు చేయడంతో పలువురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
Read Also : The Kerala Story: హమ్మయ్య ఎట్టకేలకు ఓటీటీలో విడుదల కాబోతున్నది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?