ఏపీ సర్కార్ (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు (Inter Board) విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు తెరతీసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా(Kritika Shukla) ప్రకటించారు. ఇకపై కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపనుంది. ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం విద్యార్థులపై ఉన్న పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే అని అంటున్నారు.
Hair Care Tips : కొబ్బరి చిప్పను పారేసే బదులు, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించండి
ఒకే సంవత్సరం సారాంశ పరీక్షలను నిర్వహించడం ద్వారా విద్యార్థులకు టైం, శక్తీ మిగులుతాయని బోర్డు అభిప్రాయపడింది. అయితే, ఈ నిర్ణయం చాలా బాధ్యతాయుతమైనదిగా మారనుంది. ఎందుకంటే ఫస్టియర్ పరీక్షల రద్దు విద్యార్థుల ప్రగతిని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని బోర్డు ప్రకటించింది. ఈ సమాలోచన ప్రక్రియ అనంతరం నిర్ణయాన్ని అమలు చేసే విధానంపై మరింత స్పష్టత వస్తుందని తెలిపింది.
తాజా నిర్ణయాలతో పాటు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఇది జాతీయ స్థాయిలో సమన్వయాన్ని పెంచుతుందని, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల ప్రగతిపై సానుకూల ప్రభావం చూపుతుందా లేదా అన్నది భవిష్యత్‌లో తెలుస్తుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంలో ఈ మార్పులు ఎంతవరకు సమర్థవంతమవుతాయో చూడాల్సి ఉంది.