Maoists : ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల అల‌జ‌డి లేదు – ఇంటిలిజెన్స్ నివేదిక‌

ఏపీలోని ఏజెన్సీల్లో మావోయిస్టుల బెడద లేద‌ని నిఘా వర్గాలు తాజా సమాచారం. చాలా మంది కార్యకర్తలు గత రెండు నెలలుగా

  • Written By:
  • Updated On - July 29, 2022 / 08:58 AM IST

ఏపీలోని ఏజెన్సీల్లో మావోయిస్టుల బెడద లేద‌ని నిఘా వర్గాలు తాజా సమాచారం. చాలా మంది కార్యకర్తలు గత రెండు నెలలుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు తరలివెళ్లిన‌ట్లు ప్ర‌భుత్వానికి ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చింది.కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ మృతి చెందడం, మరో నాయకురాలు అరుణ చత్తీస్‌గఢ్‌కు మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు క్యాంపులు మూతపడ్డాయని నిఘా విభాగం సీనియర్ అధికారి తెలిపారు. జూలై 28 నుండి అమరవీరుల వారోత్సవాలలో పాల్గొనాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తూ కార్యకర్తలు రెండు ప్రెస్ నోట్‌లను విడుదల చేశారు. ఈ సంవత్సరం వారోత్స‌వాల్లో ఎవ‌రు పాల్గొనరని తాము భావిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

గత నెలలో ఏరియా కమిటీ కార్యదర్శి వనతల రామకృష్ణ అరెస్టు, 33 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు లొంగిపోవడం మ‌వోయిస్టు పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌లింది. రామకృష్ణ నుంచి 39 లక్షల నగదు, పిస్టల్స్‌,పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోలాగా గిరిజన యువకులు వామపక్ష తీవ్రవాదంలో చేరేందుకు మొగ్గు చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. గిరిజ‌న యువ‌కులు నైపుణ్యాలను పెంపొందించుకుని పట్టణాల్లో ఉద్యోగాలు చేసి అర్థవంతమైన జీవితాన్ని గడపాల‌ని పోలీసులు కోరుతున్నారు. వారి ఆశయాలను నెరవేర్చడానికి, పోలీసులు ఇటీవలి కాలంలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం, వారికి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కార్యకర్తలకు ఆర్థికసాయం అందించే ‘పరివర్తన్‌’ కార్యక్రమం కింద ఇటీవల గంజాయి స్మగ్లింగ్‌కు చెక్‌ పెట్టారు.