AP Homeminister: భారీ వర్షాలున్నాయి.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి!

  • Written By:
  • Updated On - June 28, 2024 / 10:07 PM IST

AP Homeminister: ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఐఎండి అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైయ్యే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడూ వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జూన్ నెలలో ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయంలోపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో అత్యధికంగా 184 మి.మీ అతిభారీ వర్షపాతం నమోదైందన్నారు. తరచూ వరదలు సంభవించే నదీపరివాహక ప్రాంతాల్లో చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు