Site icon HashtagU Telugu

AP Home Minister: ఎంపీ గోరంట్ల వీడియోపై అనుమానం ఉంది: హోంమంతి వనిత..!!

Taneti Vanitha AP home Minister

Taneti Vanitha AP home Minister

వైసీపీ ఎంపీ గోరంట్లకు సంబంధించిన వైరల్ వీడియో వ్యవహారంపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఎంపీ మాధవ్ కు చెందినదిగా చెబుతున్న వీడియోలో.. రాజకీయ కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. ఇదే విషయాన్ని మాధవ్ కూడా చెప్పారని వనిత అన్నారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని.. ఎంపీ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

మాధవ్ కు సంబంధించిన వీడియోగా చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ విచారణలో ఉందన్నారు. నిపుణులు పర్యవేక్షిస్తున్నారన్నారు. త్వరలోనే ఫోరెన్సిక్ నివేదిక వస్తుందన్నారు. ఆ వీడియో నిజం అయితే తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వనిత అన్నారు. విపక్షాలు చేసున్న ప్రచారంలో వాస్తవం లేదన్న హోంమంత్రి.. మాధవ్ ను ప్రభుత్వం రక్షించడం లేదని స్పష్టం చేశారు.