Amaravathi : ఇవాళ జ‌గ‌న్‌కు షాకిచ్చే తీర్పు?

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన ప‌లు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది.

  • Written By:
  • Updated On - July 14, 2022 / 11:39 AM IST

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన ప‌లు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. గతంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని కొందరు రాజధాని రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే.. అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు సమయం పడుతుందని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

అయితే.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజధాని నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ల పై ఇవాళ హైకోర్టు విచారించబోతోంది. ఈ సందర్భంగా హైకోర్టు చేసే వ్యాఖ్యలు.. ఇచ్చే తీర్పు కీలకం కాబోతున్నాయి. ఏమాత్రం తీర్పు, వ్యాఖ్యలు తేడాగా ఉన్నా టీడీపీ అనుకూల మీడియా రచ్చ రచ్చ చేసే అవకాశం ఉంది.