ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా (Social Media) పోస్టులు, కామెంట్లపై నమోదయ్యే కేసుల్లో మేజిస్ట్రేట్‌లు అనుసరించాల్సిన విధివిధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా కేసుల్లో నేరంగా గుర్తించబడే పోస్టులు లేదా కామెంట్ల విషయంలో నేరుగా రిమాండ్ విధించడం కాకుండా, సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ముఖ్యంగా ఆర్నేష్ కుమార్ (Arnesh Kumar) మరియు ఇమ్రాన్ ప్రతాప్‌గఢి కేసుల్లో ఉన్న న్యాయ తీర్పులను మేజిస్ట్రేట్‌లు గౌరవించాలని ఆదేశించింది.
Underarms: మీ చంకలు నల్లగా ఉన్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!
ఇమ్రాన్ ప్రతాప్‌గఢి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. వ్యాఖ్య స్వేచ్ఛ, రచనల హక్కు, కళాత్మక వ్యక్తీకరణలపై నమోదయ్యే కేసుల్లో నేర శిక్ష 3 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉంటే, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదు. ముందుగా ఒక ప్రాథమిక విచారణ జరపాలి. ఈ విచారణ కోసం డీఎస్పీ స్థాయి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. విచారణను 14 రోజుల్లోపే పూర్తి చేయాలి. ఈ మార్గదర్శకాలే హైకోర్టు ఇప్పుడు మరోసారి మేజిస్ట్రేట్‌లకు గుర్తు చేసింది.
ఇక ఆర్నేష్ కుమార్ తీర్పు ప్రకారం.. 7 సంవత్సరాలకు లోపు శిక్ష ఉన్న నేరాల్లో అరెస్టులు ఆటోమేటిక్‌గా చేయరాదు. పోలీస్‌లు అరెస్టు చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా రికార్డు చేయాలి. ఈ ప్రాసెస్‌ను గౌరవించకుండా నేరుగా రిమాండ్ విధిస్తే, సంబంధిత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. ఈ ఆదేశాలతో ఇకపై సోషల్ మీడియా కేసుల్లో విచక్షణతో, చట్టపరమైన మార్గాలను అనుసరించేలా మేజిస్ట్రేట్‌లు వ్యవహరించాల్సిన అవసరం ఉంది.