AP High Court: ‘బిగ్ బాస్ షో’ పై ఏపీ హైకోర్ట్ సీరియఎస్!

తెలుగు సినిమాలకు ఎలా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, బిగ్ బాస్ షోలకు అంతకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  • Written By:
  • Updated On - September 30, 2022 / 02:48 PM IST

తెలుగు సినిమాలకు ఎలా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, బిగ్ బాస్ షోలకు అంతకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ షో అలరిస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ కంటే వల్గారిటీ ఎక్కువ ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పోటీల పేరుతో ముద్దులు, హగ్గులు లాంటివి విపరీత పోకడలకు వేదికైందని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 షోలో కంటెస్టెంట్లు అసభ్యకరంగా ప్రవర్తించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం వాదనలు విన్నది.

బిగ్ బాస్ నిర్వాహకులు ఐబీఎఫ్ మార్గదర్శకాలను పాటించడం లేదని, అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని లాయర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. బిగ్‌బాస్ షోలో అసభ్యకరంగా ప్రవర్తించడంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం తరపు న్యాయవాది సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం కోరారు. తదుపరి విచారణలో నోటీసుల జారీపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది.

బిగ్ బాస్ తెలుగు షో మొదటి సీజన్ నుండి నిర్వాహకులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వచ్చాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ఇతర రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు బిగ్ బాస్ షోలో అసభ్యతను వ్యతిరేకిస్తున్నారు. “బిగ్ బాస్ షోల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు” అని ఇతర పార్టీల నేతలు తేల్చి చెప్పారు.