Skill Development Scam Case : స్కిల్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వాక్యంతో తీర్పును వెలువరించారు. 'ది పిటిషన్ ఈజ్ డిస్ మిస్డ్' అని చెప్పి, బెంచ్ దిగి వెళ్లిపోయారు

Published By: HashtagU Telugu Desk
ap high court suspends chandrababu petition

ap high court suspends chandrababu petition

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Scam Case)లో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు హైకోర్టు (AP High court) నుండి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వాక్యంతో తీర్పును వెలువరించారు. ‘ది పిటిషన్ ఈజ్ డిస్ మిస్డ్’ అని చెప్పి, బెంచ్ దిగి వెళ్లిపోయారు. స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించింది.

తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ పిటిషన్ ఫై ఈరోజు శుక్రవారం హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందో అనే అంత ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..కోర్ట్ చంద్రబాబు వాదనలను తోసిపుచ్చి షాక్ ఇచ్చింది.

ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడం తో..ఏసీబీ కోర్ట్ (ACB Court) చంద్రబాబు కస్టడీ పిటిషన్ ఫై తీర్పు చెప్పే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఈరోజు చంద్రబాబు ఏసీబీ కోర్టులో వర్చువల్ విధానంలో హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు తన ఆవేదనను వ్యక్తం చేసారు. జైలులో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తికి వివరించారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని జడ్జిని కోరారు. “45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అన్యాయంగా నన్ను అరెస్టు చేసారని న్యాయమూర్తి తో చెప్పుకున్నారు.

దీనికి న్యాయమూర్తి సైతం చంద్రబాబు కు బాసటగా నిలిచినట్లు తెలుస్తుంది. మీరు పోలీస్ రిమాండ్ లో లేరని జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నారని..జ్యుడీషియల్ కస్టడీలో ఉంటె తప్పు చేసినట్లు కాదని , మీపై ఓ ఆరోపణ వచ్చింది..దానిని నిరూపించుకోవచ్చని అంతే తప్ప మీరు నేరం చేసినట్లు కాదని బాబు కు న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తుంది. మీ భద్రత విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని, మీ పూర్తి భద్రత మాదేనని న్యాయమూర్తి చంద్రబాబు కు చెప్పినట్లు సమాచారం. ఇక చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్ట్ పొడిగించే అవకాశం ఉంది. ఈ నెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడగించాలని భావించింది. కాకపోతే క్వాష్ పిటిషన్ ఫై హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూసాక..రిమాండ్ విషయంలో ఓ క్లారిటీ రావాలని ఏసీబీ కోర్ట్ భావించింది. ఇక ఇప్పుడు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం తో..చంద్రబాబు రిమాండ్ ను పొడిగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు కు ఈరోజు బ్యాడ్ డే అనే చెప్పాలి.

  Last Updated: 22 Sep 2023, 01:56 PM IST