Andhra Pradesh : అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణాలపై స్టే

  • Written By:
  • Updated On - August 3, 2023 / 02:28 PM IST

అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ గడమాన్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్‌హరీలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలోని ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌లో ఉంచి.. ఈ రోజు (గురువారం) తీర్పు వెలువరించింది. రాజధాని అమరావతిలో ఆర్‌5 జోన్‌కు సంబంధించి సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించిన చట్టం 13/2022, జీఓ 45ను సవాలు చేస్తూ రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ, రైతు సంక్షేమ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. రాజధాని ప్రాంతంలో దాదాపు 1,400 ఎకరాల భూమిని పంపిణీ చేస్తూ ఆర్‌-5 జోన్‌లో జగనన్న కాలనీల రూపంలో పేదలకు ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అదనంగా, అమరావతిలో 50,793 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు మంజూరు చేశారు.