Site icon HashtagU Telugu

Angallu Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

Angallu Case Chandrababu

Angallu Case Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పై నమోదయిన అంగళ్లు కేసు (Angallu Case) తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు (AP High Court). ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22వ తేదీన ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈరోజు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పై వాదనలు జరిగాయి. వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ (AP High Court reserves verdict ) చేసింది. మరి ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.

ఇదిలా ఉంటె ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)ను 14 వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ ..సీఐడీ కోర్టులో మెమో ఫైల్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును సీఐడీ అధికారులు నిందితుడిగా చేర్చారు. దీంతో నారా లోకేష్‌ను సైతం పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కస్టడి పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు.

Read Also : Asaduddin Owaisi : చంద్రబాబును నమ్మలేం.. ప్రజలు కూడా నమ్మొద్దు : ఒవైసీ