AP High Court: ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలకు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గతంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఆ కేసుపై కోర్టు తీరునిచ్చింది. వివరాలలోకి వెళితే..
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పలు ముందస్తు బెయిల్ పిటిషన్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది . 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైఎస్‌ఆర్‌సిపి కి చెందిన పలువురు నేతలకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన కోర్టు, ముందస్తు బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌ను కొట్టివేసింది.
చంద్రబాబు ఇంటిపై, టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు వేసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. అయితే ఈ రెండు కేసులో వారి బెయిల్ పిటిషన్లను రిజెక్ట్ చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. కాగా వైసీపీ నేతలు అరెస్ట్ కాబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రెండు వారాల గడువు ఇచ్చే అంశాన్ని ఈ రోజు మధ్యాహ్నం పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. మరి వైఎస్సార్‌సీపీ నేతల అభ్యర్థనపై ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.
Also Read: Vivo T3 pro 5G: మార్కెట్లోకి విడుదల అయిన వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే సూపర్ ఫీచర్స్!