Site icon HashtagU Telugu

AP High Court : ఎస్సై నియామకాలపై ఏపీ హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్‌

Ap High Court

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై నియామకాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల మంది దేహదారుఢ్య పరీక్షలకు(ఫిజిక‌ల్ టెస్ట్‌) హాజరయ్యారని, వారిలో సరిపడా ఎత్తు లేరని 5 వేల మందిని తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు. అయితే తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2019లో క్వాలిఫై అయి ఇప్పుడెందుకు తిరస్కరణకు గురయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది. డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ద్వారా ఎత్తు కొలిచారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎత్తు విషయంలో ఈ ఏడాది ఎలా తిరస్కరణకు గురయ్యారని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రతి అభ్యర్థి విషయంలో చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ నెల 14న జరిగే మెయిన్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల వల్ల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది.

Also Read:  AP CM YS Jagan : అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునే ప్యాకేజీ స్టార్‌ – జగన్