Bail Granted : రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్

Bail Granted : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజురు చేసింది.

  • Written By:
  • Updated On - October 11, 2023 / 03:15 PM IST

Bail Granted : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజురు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులలో చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించింది. చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, కేసుల విచారణకు సహకరిస్తామని కోర్టుకు తెలిపారు.దీంతో రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు వచ్చే సోమవారం వరకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో అప్పటివరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక  అంగళ్లు కేసులో రేపటి వరకు అరెస్ట్ చేయొద్దని సీఐడీని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join

ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.  దర్యాప్తు అధికారిని మార్చేసింది. ఈ మేరకు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు సమాచారం అందించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చడం ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్ధతో పాటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు లబ్ది జరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసును ఇప్పటివరకు అదనపు ఎస్పీ జయరామరాజు దర్యాప్తు చేయగా.. ఇకపై ఆయన స్ధానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్‌ ఇన్వెస్టిగేట్ చేయనున్నారు. ఈమేరకు వివరాలతో ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు (Bail Granted) మెమో దాఖలు చేశారు.

Also read : Galaxy Buds 2 Pro: అమెజాన్‌లో 2,899 రూపాయలకే గెలాక్సీ బడ్స్ 2 ప్రో..?