ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మైనార్టీ వివాహాలకు అందజేస్తున్న దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలియజేయండి. ఈ పథకం ద్వారా 50వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేలుగా పేద మైనారిటీ వారికి అందజేస్తోంది. కాగా ఇదే విషయంపై అప్పటినుంచి ఏదో ఒక వార్త రోజు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక మైనార్టీ వాళ్లు ఇదే విషయంపై దుల్హన్ పథకాన్ని అమలుపరచాలి అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు నినాదాలు చేసిన విషయం తెలిసిందే.
కాగా ఇదే విషయంపై తాజాగా ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 2015లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, అయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ 50,000 ఉన్న ఆ పరిహారాన్ని లక్ష రూపాయలకు చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఆ హామీని అమలు చేయడం లేదంటే పిటిషన్ లో పేర్కొన్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఏపీ ప్రభుత్వం ఇటీవల దుల్హన్ పథకం ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకాన్ని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు సిబ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్ పై ఇప్పటికే ఒక దపా విచారణ జరిగింది. కాగా తాజాగా గురువారం మరొకసారి విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా దుల్హన్ పథకాన్ని ఆపేశామని ఏపీ ప్రభుత్వం చెప్పారు కదా.. మరి ఆ పథకాన్ని నిలిపివేయడానికి గల కారణాలు ఏమిటో చెప్పాలి అంటూ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. అయితే ఆ పథకాన్ని నిలిపివేయడానికి గల కారణాలు తెలపడానికి తమకు నాలుగు వారాలు గడువు కావాలి అని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టును కోరారు. ఇక ఆ ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్థనను మన్నించిన హైకోర్టు, విచారణను తిరిగి నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు తెలిపింది.