ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్స్ విధానంపై జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాక్టర్లు , నర్సులు, పారా మెడికల్ సిబ్బంది అన్ని పీహెచ్సీల్లో ఉన్నారా లేదా అని కృష్ణ బాబు ఆరా తీశారు. ఎమ్మార్వో లు , ఎంపిడీవోలను పీహెచ్సీలకు పంపించి ఆడిట్ చేయించాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించే లోగా ఆడిట్ పూర్తి కావాలని కలెక్టర్లకు తెలిపారు. కలెక్టర్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలని.. మూడు నెలలకు సరిపడా మందులు, టెస్ట్ కిట్లు , వైద్య పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఏపీఎమ్ఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డిని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం కోసం నియమించిన అధికారులు, సిబ్బంది జాయిన్ అయ్యారా లేదా అని అధికారులను కృష్ణబాబు అడిగి తెలుసుకున్నారు.
Family Doctor : ఏపీలో ఫ్యామిలీ డాక్టర్స్ విధానం.. జిల్లా కలెక్టర్లతో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష

Mt Krishna Babu Imresizer