Site icon HashtagU Telugu

AP Health Principal Secretary : 108 పనితీరుపై ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అస‌హ‌నం

108 Imresizer

108 Imresizer

ఏపీలో 108, 104 సేవ‌ల‌పై వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌న్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కృష్ణ‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మంగళగిరి వీటి పనితీరును ఆయ‌న స్వ‌యంగా వెళ్లి స‌మీక్షించారు. ఈ స‌మీక్ష‌లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఆరోగ్య శ్రీ సిఇవో హరీందర్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. గతంలో అందిన విధంగా ఇప్పుడెందుకు 108 సేవలందడంలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. 108 సర్వీస్ ప్రొవైడర్, టెక్నికల్ విభాగాల బాధ్యులు ఏంచేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.గతంలో ఐటీ విభాగం సమర్ధవంతంగా పనిచేయగా.. ఇప్పటి ఐటీ విభాగం ఎందుకు కుంటుపడిందని అధికారుల‌ను ప్ర‌శ్నించారు.

సమర్ధవంతంగా పనిచేసే ఐటీ పార్టనర్ ను ఏర్పాటు చేసుకోవాల‌ని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇవోను ప్రిన్సిప‌ల్ సెక్ర‌టరీ కృష్ణబాబు ఆదేశించారు. 108 పనితీరును వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు అడిషన్ సిఇవో మధుసూదన్ రెడ్డి వివరించారు. ఈ సంర్భంగా 108 వాహనాల్ని రిపేర్ చేయండంలో ఎందుకు జాప్యం జరుగుతోందని కృష్ణబాబు ప్రశ్నించారు. 108 వాహనాలకు జిపిఎస్ లేకపోవడంపై తీవ్ర ఆగ్రహాం వ్య‌క్తం చేశారు. పనిచేయని వాహనాల విషయంలో ఎందుకు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. 748 వాహనాల్లో 164 వాహనాలకు ట్రాకింగ్ లేకపోతే వాటిని స‌రి చేయ‌కుండా ఏం చేస్తున్నార‌ని అధికారులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రెండు వారాల్లో ప‌నితీరు మెరుగుపర‌డ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారుల‌ను హెచ్చ‌రించారు

Exit mobile version