Site icon HashtagU Telugu

RUIA incident: రుయా ఘటనపై స్పందించిన ఏపీ మంత్రి…దోషులను వదిలిపెట్టం..!!

Ap Minister Imresizer

Ap Minister Imresizer

తిరుపతి రుయా ఆసుపత్రి సంఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పందించారు. ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా మహా ప్రస్ధానం అంబులెన్స్ లు 24 గంటలు పనిచేసేలా త్వరలోనే ఓ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ…ఘటనపై రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి నుంచి వివరాణ కోరాము. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ అంబులెన్స్ లను నియంత్రిస్తాం. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టము. దోషులను కఠినంగా శిక్షిస్తాం. మృతుడి కుటుంబ సభ్యులు మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ ను ఎవరు బెదిరించారన్న దానిపై లోతుగా విచారణ చేపడతాం. ఇకపై మహాప్రస్థానం వాహనాల్లో ఉచితంగానే డెడ్ బాడీలను తరలిస్తాం. మహాప్రస్థానం అంబులెన్స్ లు 24గంటలు పనిచేసేలా త్వరలోనే విధానం తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.