Site icon HashtagU Telugu

AP : జగన్ సర్కార్ కు మరో షాక్..సమ్మె సైరెన్ మోగించనున్న పంచాయతీ ఉద్యోగులు..!!

ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ ఉద్యోగులు జగన్ సర్కార్ కు ఊహించని షాక్ ఇవ్వనున్నారు. వచ్చే నెల 2 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు తొమ్మిది ప్రధాన డిమాండ్లతో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఉద్యోగుల సంఘం నేతలు సమ్మె నోటిసులు ఇచ్చారు. తమకు చెల్లించాల్సిన బకాయిలు, జీతాలు చెల్లించాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ను ఉద్యోగుల సంఘం కోరింది.

పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లకు రూ. 20వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది. హెల్త్ అలవెన్స్ లతోపాటు, రక్షణ పరికరాలు, ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలని కోరింది. ధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 10లక్షలు, సాధారణంగా మరణించిన కార్మికులకు రూ. 5 లక్షలు ఇవ్వాలని పంచాయితీ రాజ్ కమిషనర్ ను ఉద్యోగుల సంఘం నేతలు కోరారు.

Exit mobile version