Site icon HashtagU Telugu

AP Govt: సీపీఎస్ ర‌ద్దు కోసం క‌మిటీ

Botsa Satyanarayana

Botsa Satyanarayana

సీపీఎస్‌ విషయంలో ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం అండగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సీజ్ చేయడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కమిటీ వేసినట్లుగానే అన్ని విషయాలను పరిశీలిస్తుందని బొత్స చెప్పారు. దానిపై మరో సభ ఉంటుందని, టీచర్ల సెలవులపై ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ, బీజేపీలపై మండిపడ్డారు. మరోవైపు సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన యూటీఎఫ్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. ముట్టడిలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ముందస్తు నోటీసు ఇచ్చారు.

విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గుంటూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో వందలాది మంది ఉపాధ్యాయులను స్టేషన్‌కు పిలిపించి నోటీసులిచ్చి ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ తెలిపారు

Exit mobile version