NTR University: జగన్ వివాదాస్పద నిర్ణయం, ఎన్టీఆర్ బదులు వైఎస్సార్ పేరు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద నిర్ణయం తీసున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 08:01 AM IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద నిర్ణయం తీసున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ సవరణ బిల్లు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే కేబినేట్ ఆమోదం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం – వర్సిటీ పేరు మార్పునకు ఆన్ లైన్ లోనే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో సవరణ బిల్లు ను వైద్యశాఖ మంత్రి రజని బుధవారం ప్రవేశపెట్టనుంది.
యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడింది. 1986 ఏప్రిల్ 9న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ప్రారంభించారు. 1 నవంబర్ 1986న విశ్వవిద్యాలయం మొదటి ఛాన్సలర్‌గా రామారావుతో పనిచేయడం ప్రారంభం అయింది. ఎన్టీఆర్ మరణానంతరం, 2 ఫిబ్రవరి 1998న విశ్వవిద్యాలయం “డా. NTR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్”గా పేరు మార్చాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. విశ్వవిద్యాలయం తన రజతోత్సవాన్ని గత ఏడాది నవంబర్ 1 నుండి 3వ తేదీ వరకు జరుపుకుంది.
ఎన్టీఆర్ పేరుతో ప్రఖ్యాతి గాంచిన ఆ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివేర్సిటీగా మార్చేలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదం అయింది.