YS Jagan : స‌చివాల‌యం ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్

గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్‌ ప్రకటించి, పెంచిన వేతనాలను జూలై నుంచి అందజేయ‌డానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 03:50 PM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్‌ ప్రకటించి, పెంచిన వేతనాలను జూలై నుంచి అందజేయ‌డానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ మేర‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ప్ర‌క‌టించారు. సర్వే శాఖను పునర్వ్యవస్థీకరించి పదోన్నతులు కల్పించి 410 పోస్టులకు ప్రమోషన్ అవకాశాలు కల్పించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సర్వే శాఖలో 410 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మహిళా పోలీసుల సమస్యలను వివరించేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిసినట్లు సంఘం ప్రతినిధి బృందం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భీమిరెడ్డి అంజనారెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్‌ఆర్‌ కిషోర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు విప్పర్తి నిఖిల్‌, కృష్ణభార్గవ్‌, సుతేజ్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో వెంకటరామిరెడ్డిని కలిశారు.