Site icon HashtagU Telugu

AP loan From RBI: 7శాతం వడ్డీతో…వెయ్యికోట్ల అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం…!!

RBI గురువారం నిర్వహించిన బహిరంగ మార్కెట్ వేలంలో ఏపీ రూ. 1000కోట్ల రుణం తీసుకుంది. ఇందులో రూ. 500కోట్లను 13 ఏళ్ల కాలపరిమితిలో 7.72శాతం వడ్డీ చెల్లించేలా తీసుకుంది. మిగతాది రూ. 500కోట్లను 16ఏళ్ల కాలపరిమితితో 7.74 శాతం వడ్డీకి తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఇక ఈ రుణంతో కలిపి ఈ ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పటి వరకు రూ. 34,980కోట్ల రుణాలు తీసుకుంది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9నెలల్లో రూ. 43,803కోట్ల బహిరంగ రుణాన్ని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే నాలుగున్నర నెలల్లోనే ఏకంగా రూ. 34వేల కోట్లకుపైగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం రుణం పొందడం ఆలోచించాల్సిన అంశం.

Exit mobile version