Site icon HashtagU Telugu

Theatres in AP : ఏపీ ధియేట‌ర్ల‌లో ఇంత అరాచ‌క‌మా?

Ap Govt Theatres

Ap Govt Theatres

ఏపీ వ్యాప్తంగా సినిమా థియేట‌ర్ల‌పై పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్ట‌ర్లు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. థియేట‌ర్ల‌లో స్నాక్స్‌, వాట‌ర్ బాటిల్స్ అధిక రేట్ల‌కు విక్ర‌యిస్తుండ‌టంతో ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది. విజయవాడ న‌గ‌రంలో విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు. పీవీఆర్ మల్టీప్లెక్స్, అప్సర, అలంకార్, శైలజ, క్యాపిటల్ సినిమాస్ అన్నపూర్ణ థియేటర్లల్లో విస్తృత తనిఖీలు కొనసాగాయి. థియేట‌ర్ల‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కెమెరాలు సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? అనేది ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. థియేటర్లల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌, క్యాంటీన్‌లను అధికారులు తనిఖీ చేశారు. అమ్మకానికి ఉంచిన ఆహార పదార్థాల నాణ్యత, ప్యాకేజింగ్‌ను పరిశీలించి… వాటి రేట్ల గురించి ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు.

థియేట‌ర్ల‌లో వాట‌ర్ వాటర్ బాటిల్స్ ని అధిక థ‌ర‌ల‌కు అమ్మ‌డం పై ప్రజలు స్పందించారు. రూ. 20 ఖరీదు చేసే బాటిల్ రూ. 50 కి అమ్ముతున్నానరి ప్రేక్ష‌కులు అధికారుల‌కు తెలిపారు. మ‌ల్టిఫ్లెక్స్ థియేట‌ర్ల‌లో స్నాక్స్‌, వాట‌ర్ బాటిల్స్ పేరుతో ప్రేక్ష‌కుల జేబుల‌కు చిల్లు పెడుతున్నారు. పాప్ కార్న్ రూ. 200, వాట‌ర్ బాటిల్ ని రూ.50పైగా అమ్ముతున్నారు.దీంతో పాటు థియేట‌ర్ల‌లో హైఫై ఫుడ్ క్యాంటిన్లు ఏర్పాటు చేసి బ‌య‌ట ఉన్న రేటు కంటే మూడు రేట్లు అధికంగా వాటిని అమ్ముతున్నారు. ఎన్నిసార్లు అధికారులు దాడులు చేసిన వీరి తీరు మాత్రం మార‌డం లేదు.

అయితే సినిమా థియేటర్లలో తనిఖీలపై ఎగ్జిబిటర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రేపు విజయవాడలో సమావేశం కావాలని ఎగ్జిబిట‌ర్లు నిర్ణ‌యించారు. థియేటర్లలో తనిఖీలు, సీజ్‌, ప్రభుత్వం తీరుపై ఈ స‌మావేశంలో చర్చించే అవకాశం ఉంది.