AP Anganwadi : అంగన్‌వాడీలను తొలిగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 01:11 PM IST

అంగన్‌వాడీ (Anganwadi ) సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం (AP Govt) చర్యలు తీసుకుంది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్ వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబడుతూ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. నేడు చలో విజయవాడ కు పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పిలుపుతో పోలీసులు ఎక్కడిక్కడే వారిని అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం మరింత సీరియస్ అవుతూ..విధులకు హాజరుకాని వారి లిస్ట్‌ను పంపించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. అలా విధులకు గైర్హాజరైన వారిని అటోమేటిక్ టెర్మినేషన్ చేయాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కచ్చితంగా ప్రభుత్వాకి పోయే రోజులు దగ్గరుపడ్డాయని మండిపడుతున్నారు. గతంలో జగన్ ఇచ్చిన హామీలనే అడుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Read Also : Ram Lalla Darshan : ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్‌లల్లా తొలి దర్శనమిదే..