ఏపీలో అధికారం చేపట్టిన కూటమి పార్టీ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ అనేక మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో జగన్ తో చేతులు కలిపి అనేక అవకతవకలు , అక్రమాలు చేసిన అధికారుల ఫై వేటు వేస్తూ వస్తుండగా..తాజాగా ప్రభుత్వ పథకాల పేర్లను సైతం మారుస్తూ మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాలు జారీ చేసారు. పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు సర్టిఫికెట్లు జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది.
We’re now on WhatsApp. Click to Join.
మార్చిన పథకాల పేర్లు చూస్తే..
జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా పేరు మార్పు
జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్పు
వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ
వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకం అమలు
Read Also :