ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఏపీ సర్కార్ (AP Government). బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల బదిలీలపై గత కొన్ని రోజులుగా దృష్టిపెట్టిన ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రజాసంబంధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు తాజాగా ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నెల 31లోపు బదిలీలు పూర్తి చేయాలని నిర్ణయించింది.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను కూడా రిలీవ్ చేస్తూ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన సమయంలో 122 మంది తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. అయితే వారిని తిరిగి సొంత రాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వీరంతా వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నారు. అయితే వీరిని రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఇక చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Agrigold Scam : ఆగస్టు 23 వరకు జోగి రాజీవ్ రిమాండ్