AP Govt Pension: పెన్ష‌న్‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌…!

ఏపీ ప్ర‌భుత్వం పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వృద్ధుల‌కు పెన్ష‌న్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ. 2250 ఇస్తున్న పెన్ష‌న్ ను వ‌చ్చే జ‌న‌వరి 1 నుంచి రూ.2500కు పెంచింది.

  • Written By:
  • Updated On - December 14, 2021 / 10:55 PM IST

ఏపీ ప్ర‌భుత్వం పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వృద్ధుల‌కు పెన్ష‌న్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ. 2250 ఇస్తున్న పెన్ష‌న్ ను వ‌చ్చే జ‌న‌వరి 1 నుంచి రూ.2500కు పెంచింది. పాద‌యాత్ర స‌మ‌యంలో పెన్ష‌న్ ని రూ.3000 చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు అయితే అధికారంలోకి వ‌చ్చాక రూ. 2000 ఉన్న పెన్ష‌న్ ని రూ.250 పెంచుతూ రూ.2250 గా ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చారు. అయితే తాజ‌గా ప్ర‌భుత్వం తీస‌కున్న నిర్ణ‌యంతో జ‌న‌వ‌రి నుంచి రూ.2500 పెన్ష‌న్ దారులకు అంద‌నున్నాయి. నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 2022 నుండి అమలు చేయనున్నట్లు కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 61,72,964 మంది పింఛనుదారులు ప్రతినెలా పింఛన్లు పొందుతున్నారు. మరోవైపు డిసెంబర్ 2021, జనవరి 2022లో వివిధ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు డిసెంబర్ 21 తర్వాత అమలు చేయబడుతుంది.ఈబీసీ నేస్తం ప‌థ‌కం జనవరి 9న ప్రారంభించ‌నున్నారు. ఆ తర్వాత అదే నెలలో రైతు భరోసా పథకం ప్రారంభించున్నారు.