ఏపీలో పంట‌ల బీమాకు రూ. 3వేల కోట్లు

వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.

Published By: HashtagU Telugu Desk

వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై స్థానిక నాయకులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.3000 కోట్ల పంటల బీమాను అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డారు.

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీపై సీఎం సమీక్ష నిర్వహించి రైతులందరూ ఈ-క్రాప్‌ నమోదు చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో వైద్యుల నియామకంపై సీఎం మాట్లాడుతూ.. ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. చక్రాయపేట మండలంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

  Last Updated: 02 Sep 2022, 03:14 PM IST