ఆంధ్రప్రదేశ్ (AP) లో జీతాలు పెంచాలంటూ మూడు వారాలుగా అంగన్వాడీలు (Anganwadi ) సమ్మె చేస్తున్నారు..అయితే ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా జగన్ ప్రభుత్వం (YCP Govt) చెబుతోంది. ఇప్పుడు ఇదే బాటలో మున్సిపల్ కార్మికులు… ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు… ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విధులకు హాజరుకాని వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని కిందిస్థాయి అధికారులకు సూచనలు చేసింది. మరి ప్రభుత్వం హెచ్చరికతో అంగన్వాడీలు సమ్మె విరమిస్తారా..? లేక కొనసాగిస్తారా అనేది చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
సలహాదారులకు దోచిపెడుతున్న జగన్.. అంగన్వాడీల జీతాలకు డబ్బులు లేవని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. 50 మంది సలహాదారులకు లక్షల్లో జీతాలు ఇస్తున్న సీఎం జగన్… రోజు మొత్తం కష్టపడి పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఎందుకు జీతాలు పెంచడం లేదని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి 50 మంది దాకా సలహాదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి ప్రతి నెలా 2 లక్షల జీతంలో పాటు ఇతర అలెవెన్సులు ఇస్తున్నారు. వీళ్ళల్లో ముగ్గురో, నలుగురో యాక్టివ్ గా కనిపిస్తున్నారే తప్ప… మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు… ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నారన్నది అర్థం కాని ప్రశ్న. సలహాదారుల కోసం గత నాలుగున్నరేళ్ళల్లో మొత్తం 400 కోట్ల రూపాయల దాకా జగన్ ప్రభుత్వం ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు దోచి పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
వివిధ రంగాల్లో మంచి అనుభవం ఉండి… రాజకీయాల్లోకి రాలేని వారిని మాత్రమే గతంలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించేవారు. వారు ప్రభుత్వ అధికారులతో సమన్వం చేసుకుంటూ ప్రభుత్వానికి విలువైన సలహాలు అందించేవారు. కానీ ఇప్పుడు ఏ రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా ప్రభుత్వ సలహారుదారుడిగా పెత్తనం చెలాయిస్తున్నారు. ఇలాంటి వారికీ లక్షల్లో జీతాలు ఇస్తూ..ప్రతి రోజు కష్టపడుతున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని అంత అంటున్నారు.
Read Also : Puthalapattu MLA MS Babu : సీఎం జగన్ ఫై పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆగ్రహం