ఏపీలో సామాజిక సమీకరణాలు, కులాలవారీగా ప్రజల లెక్క తేల్చేందుకు జగన్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకురావడమే టార్గెట్‌గా .. సమగ్ర కులగణన (AP Caste Census) తీసుకొస్తుంది. 92 ఏళ్ల తర్వాత చేపడుతున్న కులగణనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కులాల లెక్క తేల్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ (Special App) ను సిద్ధం చేస్తున్నారు. మరో వారం లోగా ఈ యాప్ సిద్ధం కాబోతుంది. ఈ యాప్ ద్వారా కులగణన చేయబోతుంది ప్రభుత్వం.
ఈ నెల 27 నుంచి కులగణన ప్రారంభించాలని నిర్ణయించింది. దీన్ని డిజిటల్ విధానంలో చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్‌ను సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ గణన నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తిచేసేందుకు ప్రాంతీయ, జిల్లా స్థాయి సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీనికి కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సూచనలను స్వీకరించాలని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
స్వాతంత్రం రాకముందు ప్రతి పదేళ్లకోసారి కులగణన జరిగేది. 1911, 1921, 1931లోనూ కులగణన జరిగింది. 1941లో కూడా కులగణన ప్రారంభించినప్పటికీ ప్రపంచయుద్దం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో 1931లో జరిగిన కులగణన చివరగా జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఇది చేయాలనీ ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది. దేశంలో ఇటీవల బిహార్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఏపీలో కూడా సమగ్ర కులగణన ద్వారా పేదలు, అట్టడుగు, బలహీన వర్గాల ఉపాధి, ఆదాయం, విద్య, ఇలా అన్ని రంగాల్లో వారి స్థితిగతులను అంచనా వేసేలా సర్వే చేపట్టనుంది ప్రభుత్వం. ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలను ఆర్ధికంగా పైకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తాజాగా సమగ్ర కులగణన ద్వారా మరింత పటిష్టంగా పథకాలు అమలుచేస్తామని చెప్పుకొస్తుంది సర్కార్.
Read Also : BR Ambedkar : సీఎం జగన్ నివాసానికి అతి దగ్గర్లో అంబేద్కర్ విగ్రహానికి అవమానం