Good News For AP Unemployees : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్…ఆ పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర సర్కార్.

Published By: HashtagU Telugu Desk

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 240 లెక్షరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రతిపాదనలు పంపించాని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం కళాశాల్లో డిప్యూటేషన్ పై అధ్యాపకులు పనిచేస్తున్నారన్నారు. వీరితోపాటుగా కాంట్రాక్టు లెక్చరర్లను కూడా కేటాయించమన్నారు. ఉన్నతవిద్యతో పాటు, ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

వైజాగ్ లోని మద్దిలపాలెం డాక్టర్ వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. 165 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా వీటిలో రూ. 391 కోట్లతో 27 కాలేజీలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదలు పంపించినట్లు తెలిపారు.

  Last Updated: 04 Sep 2022, 10:30 AM IST