Tomato : కుళ్ళిన టమాటా అంటగడతారా..! ఏపీ సర్కార్ ఫై ప్రజల ఆగ్రహం..

విజయవాడ వాసులు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలు..గంటలు నిల్చోపెట్టి కుళ్ళిన టమాటాలు (Tomato) అంటగడతారా అని మండిపడుతున్నారు.

  • Written By:
  • Updated On - August 2, 2023 / 05:01 PM IST

విజయవాడ వాసులు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలు..గంటలు నిల్చోపెట్టి కుళ్ళిన టమాటాలు (Tomato) అంటగడతారా అని మండిపడుతున్నారు. టమాటా..ఈ పేరు చెపితే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెండు నెలల క్రితం వరకు కేజీ రూ. 20 లు ఉన్న టమాటా..ఇప్పుడు డబుల్ సెంచరీకి చేరింది. దీంతో టమాటా వైపే కాదు ఆ పేరు పలకాలన్న ప్రజలు భయపడుతున్నారు. కొందరైతే రెండు నెలలుగా వంటింట్లో టమాటనే చూడని వారు ఉన్నారు. ఒకప్పుడు టమాటా లేనిదే ఏంచేయలేం అని చెప్పే వాళ్లు..ఇప్పుడు టమాటా వైపు చూడలేం అనే మాటకు వచ్చారు.

మొన్నటి వరకు కేజీ టమాటా రూ. 100 , 120 ఉండడం తో మరో రెండు రోజులైతే తగ్గుతాయిలే అని అనుకున్నారు. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా(Tomato) ధర భారీగా పెరిగింది. నెల రోజులుగా టమాటా ధర విపరీతంగా ఉండడం..చాలామంది రైతులు కోటేశ్వర్లు అవుతుండడం తో మరికొంతమంది రైతులు టమాటా సాగు వేశారు. కానీ తాజా వర్షాలకు ఆ టమాటా సాగు అంత పోయింది. దీంతో మార్కెట్ లలో టమాటా డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం టమాటా ధర రూ. 200 లకు చేరడంతో గుండెలు బాదుకుంటున్నారు.

ఏపీ లో గత కొద్దీ రోజులుగా సబ్సిడీ (AP Govt Gives Subsidy) రూపంలో టమాటా ఇస్తుండడం తో ప్రజలు అన్ని పనులు మానుకొని క్యూ లైన్ లలో గంటలతరపడి నిల్చుని టమాటా తీసుకొని వెళ్తున్నారు. వారం రోజులుగా ప్రభుత్వం టమాటా ఇవ్వడం బంద్ చేసింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. నేడు విజయవాడ మార్కెట్ కు సబ్సిడీ టమాటాలు రావటంతో అన్ని మార్కెట్లలో కిలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనం ఇచ్చాయి. ఉదయం ఏడు గంటల నుండే (Rythu Bazars) క్యూ లైన్లలో టమాటాల కోసం ప్రజలు పోటీపడ్డారు. ఒక్క మనిషికి 2కిలోల చొప్పున మాత్రమే టమాటా ఇచ్చారు. హమ్మయ్య ఎలాగైతేనేం టమాటా(Tomato) దొరికిందని సంబరంగా ఇంటికెళ్లి ఆ టమాటా చూడగా షాక్ తో దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. వారు ఇచ్చిన టమాటాలాన్ని కుళ్లిపోయి , నాసిరకంగా ఉన్నాయి. వాటిని చూసి ఛీ..గంటల తరబడి నిల్చుని ఈ కుళ్లిపోయిన టమాటలా తెచ్చుకుంది అని ప్రభుత్వం ఫై తిట్ల దండకం చేస్తున్నారు. పోతే పోయిన డబ్బులు..పావుకేజీ మంచి టమాటాలు(Tomato) తెచ్చుకున్న పోయేది..అని ఇరుగుపొరుగు వారికీ చెప్పుకొని బాధపడుతున్నారు.

Read Also : Wine Shops : మ‌ద్యం షాపుల టెండ‌ర్ల‌కు సిద్ద‌మైన ఎక్సైజ్ శాఖ‌.. ఈ నెల 4న నోటిఫికేష‌న్‌