Site icon HashtagU Telugu

AP Volunteers: 33 మంది వాలంటీర్ల పై ఏపీ ప్రభుత్వం వేటు

Ap Govt Fired 33 Volunteers

Ap Govt Fired 33 Volunteers

 

AP Volunteers: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఏకంగా 33 మంది వాలంటీర్ల(Volunteers)పై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడీపీ, ఇతర విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఓ వైపు ప్రతిపక్షాలు కూటమి కడితే… మరోవైపు సింగిల్‌గా, పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్తున్నారు వైసీపీ అధినేత‌ సీఎం జగన్‌. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు వైసీపీ బాస్‌.

read also: CSK In Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్..!

దేశంలోనే బెస్ట్ సీఎం అవుతా… రాష్ట్రానికి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇవి జగన్‌ అధికారం చేపట్టినప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు ఐదేళ్ల పాలన తర్వాత జగన్‌ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీకి ఈ ఎలక్షన్లు అత్యంత కీలకంగా మారాయి. ఐదేళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇది పరీక్షా కాలంగా వైసీపీ భావిస్తోంది.