3 Capital Bill: మూడు రాజధానులపై హైకోర్టులో అఫిడవిట్

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రతిని అఫిడవిట్ రూపంలో హైకోర్టు కు ప్రభుత్వం దాఖలు చేసింది.

  • Written By:
  • Publish Date - November 26, 2021 / 07:15 PM IST

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రతిని అఫిడవిట్ రూపంలో హైకోర్టు కు ప్రభుత్వం దాఖలు చేసింది.
వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల రద్దుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న శాసనసభలో, 23న శాసనమండలిలో ఉపసంహరణ చేసుకుంది. బిల్లులను ఆమోదించినట్లు శాసనసభ కార్యదర్శి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
మే 22న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌తో పాటు బిల్లుకు సంబంధించిన రెండు కాపీలను దాఖలు చేసింది. అఫిడవిట్ కాపీలను పిటిషనర్లకు పంపినట్లు ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు తెలిపారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే, మూడు రాజధానుల ఆలోచనను ఏపీ ప్రభుత్వం విరమించుకోలేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పాడు. చట్టపరమైన, ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై కొత్త బిల్లును తీసుకురానుంది. త్రీ క్యాపిటల్ బిల్లు సమగ్రంగా సవరించి మళ్ళీ తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని మాత్రం ఆఫీడవిట్లో పొందు పరచలేదు. అసెంబ్లీ వేదికగా జగన్ మూడు రాజదానులపై మాట్లాడిన మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే అఫిడవిట్ ను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.