School Holidays: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం విపత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విపత్తును చూడలేదని అన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సహాయక చర్యలను సమీకరించింది. పరిస్థితిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదివారం ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను భారీ వర్షాలు గణనీయంగా ప్రభావితం చేశాయని చంద్రబాబు ధృవీకరించారు.
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే మారుమూల గ్రామాలకు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
Also Read: Hero Vijay : హైదరాబాద్ లోని మాస్ థియేటర్ లో సలార్ చిత్రాన్ని చూసిన హీరో విజయ్